AMAZON BEST DEALS

https://amzn.to/3Fq4ABu

Sunday 2 October 2016

A BEGGER STUDIED IN ENGLAND (బిచ్చమెత్తి బతికాడు.. ఇంగ్లండ్లో చదివాడు)

చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్అమెరికా అధ్యక్షుడయ్యాడని గొప్పగా చెప్పుకున్నాం. అడుగడుగునా వివక్షను ఎదుర్కొన్న అంబేడ్కర్రాజ్యాంగం రాశారని చదువుకున్నాం. ఇవన్నీ తరం వాళ్లు విన్నవే తప్ప కళ్లతో చూడని కథలు. కానీ ఇప్పుడు మన ముందే కుర్రాడు అలాంటి విజయాన్ని అందుకున్నాడు. కొన్నేళ్ల క్రితం దాకా ట్రాఫిక్సిగ్నళ్ల దగ్గర భిక్షమెత్తుకున్న జయవేల్చిన్నయ్య... ఇప్పుడు కేంబ్రిడ్జ్యూనివర్సిటీనుంచి ఇంజినీరింగ్పూర్తి చేసి పై చదువులకు ఇటలీ బయల్దేరాడు.రవై రెండేళ్ల కుర్రాడు కేంబ్రిడ్జ్యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్పట్టా పుచ్చుకోవడం గొప్ప విషయం కాకపోవచ్చు. కానీ భిక్షమెత్తుకునే దశ నుంచి వచ్చి ఘనత సాధించడం మాత్రం అరుదైన విజయమే. స్థాయికి చేరడానికి చిన్నయ్య పెద్ద కష్టాలనే దాటాడు. చిన్నయ్య స్వస్థలం నెల్లూరు. అతడి తండ్రి పొలాన్ని కౌలుకి తీసుకొని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. జిల్లాలో కరవు ప్రభావంతో పొలాలు ఎండిపోయాయి. చేసిన అప్పులు తీరే దారి కనిపించలేదు. దాంతో భార్యనీ కొడుకునీ తీసుకొని చెన్నైకి వలసెళ్లిపోయాడు. అక్కడికెళ్లిన కొన్నాళ్లకే అనారోగ్యంతో అతడు చనిపోయాడు. దాంతో చిన్నయ్యా, అతడి తల్లీ రోడ్డున పడ్డారు. ఏం చేయాలో తెలీక తల్లి బిచ్చమెత్తి కొడుకుని పోషించడం మొదలుపెట్టింది. తరవాత చిన్నయ్యనూ మిగతా పిల్లలతో కలిసి ట్రాఫిక్సిగ్నళ్ల దగ్గర భిక్షాటనకు పంపించేది. అలా నెలల తరబడి ఒకే నిక్కరుతో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ కాలం వెళ్లదీశాడు చిన్నయ్య.
అదృష్టం వెతుక్కుంటూ... 
పక్క కొడుకు యాచిస్తూ జీవించడానికి అలవాటు పడుతుంటే, మరోపక్క అతడి తల్లి మద్యానికి బానిసైంది. సాయంత్రం దాకా పిల్లాడు సంపాదించిన డబ్బంతా తీసుకెళ్లి పూటుగా తాగిరావడమే ఆమె దినచర్యగా మారిపోయింది. చేసేదేమీ లేక అతడు కూడా దొరికింది తింటూ గాలికి తిరిగేవాడు. పూట కడుపు నిండితే చాలనుకునే పరిస్థితి. రోజులు అలానే గడిస్తే అతడి జీవితం మరో చిత్తు కాగితాల చరిత్రలో కలిసిపోయుండేది. కానీ యువ జంట రూపంలో వెతుక్కుంటూ వచ్చిన వరం చిన్నయ్య జీవితాన్నే మార్చేసింది. ఉమ, ముత్తురామన్ అనే దంపతులుసుయంపేరుతో స్వచ్ఛంద సంస్థను నడిపిస్తున్నారు. చెన్నైలో వీధి బాలల జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో చూపించేందుకుపేవ్మెంట్ఫ్లవర్‌’ పేరుతో డాక్యుమెంటరీని చిత్రీకరించే పనిలో పడ్డారు. అందులో భాగంగా వీధి వీధీ తిరుగుతూ రోజు చిన్నయ్య దగ్గరికొచ్చారు. ఏదో కాసేపు వీడియో తీసుకొని వెళ్లిపోదామనుకున్న జంటకు చిన్నయ్యతో మాట్లాడాక, అతడిని చదివిస్తే బావుంటుందన్న ఆలోచన వచ్చింది. చిన్నయ్య తల్లితో సహా తోటి వాళ్లెవరూ దానికి ఒప్పుకోలేదు. గతంలో చాలామంది పిల్లల్ని చదివిస్తామని తీసుకెళ్లి బయటి నుంచి నిధులు తెచ్చుకొని పిల్లల్ని గాలికొదిలేశారు. ఉమ దంపతులు కూడా బాపతే అనుకున్నారు. కానీ వరసగా నాలుగైదు రోజులు పదేపదే అడగడంతో కనీసం రెండు పూటలా తిండైనా దొరుకుతుందన్న ఆశతో చిన్నయ్య వాళ్లతో వెళ్లడానికి ఒప్పుకున్నాడు.

కేంబ్రిడ్జ్లో సీటు 
మొదట కాసిని అక్షరాలు దిద్దించి తరవాత చిన్నయ్యను స్కూల్లో చేర్పించాలన్నది ఉమ ఆలోచన. కానీ అతడి ధ్యాసెప్పుడూ ఆటలమీదే ఉండేది. చదువంటే దూరంగా పారిపోయేవాడు. కనీసం స్కూల్లో చేర్పిస్తేనైనా మిగతా పిల్లల్ని చూసి మారతాడనిపించి పని చేశారు. తక్కిన విద్యార్థులంతా వీధిలో గతంలో చాలాసార్లు చిన్నయ్య బిచ్చమడుగుతుంటే చూసిన వాళ్లే. క్రమంగా మిగతా పిల్లల జీవన శైలినీ, తన కోసం ఉమ పడుతోన్న కష్టాన్నీ చూసి చదువుపైన దృష్టిపెట్టే ప్రయత్నం చేశాడు. రోజులు గడిచేకొద్దీ విద్య బాగానే ఒంటబట్టింది. ఫస్ట్క్లాసులో పదోతరగతి, డిస్టింక్షన్లో పన్నెండో తరగతీ పూర్తిచేశాడు. ఆటోమొబైల్ఇంజినీరింగ్పైన ఆసక్తి ఉన్న చిన్నయ్య కేంబ్రిడ్జ్యూనివర్సిటీలో కోర్సు చేయడానికి దరఖాస్తు చేశాడు. ఉమ దంపతులను ఆశ్చర్యపరుస్తూ ప్రవేశ పరీక్షలోనూ పాసయ్యాడు. చిన్నయ్య పట్టుదలా, తెలివితేటలూ నచ్చి దాతలూ అతడికి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు. అలా ఒకప్పుడు కార్లకు అడ్డుతగిలి చేయిజాచిన పిల్లాడు, ఏకంగా కార్లకు సంబంధించిన ఇంజినీరింగ్చదవడానికి విమానమెక్కి ఇంగ్లండ్లోని వేల్స్ప్రాంతానికి బయల్దేరాడు
.
లక్ష్యం... ఐఏఎస్
మనుషులూ, భాషా, జీవనశైలీ... అన్నీ కొత్తే అయినా కష్టపడి అన్ని సెమిస్టర్లూ తొలి ప్రయత్నంలోనే పాసై చిన్నయ్య ఇంజినీరింగ్పూర్తి చేశాడు. ఇప్పుడు అడ్వాన్స్డ్ఇంజినీరింగ్కోర్సు చేసేందుకు ఇటలీలోని ట్యూరిన్యూనివర్సిటీలో అడ్మిషన్సాధించాడు. చిన్నయ్య ప్రభావంతో చాలా మంది పిల్లలు భిక్షాటన మానేసి చిన్నచిన్న పనులు చేసుకుంటున్నారు. ఉమ దంపతులు నిర్వహిస్తోన్న స్కూల్లో ఆరొందల మందికిపైగా అభాగ్యులు చదువుకుంటున్నారు. వాళ్లంతా అతడిలానే పెద్ద చదువులు చదవాలని ఆశ పడుతున్నారు. ‘చిన్నప్పుడు రోడ్డుమీద పడుకుంటే పోలీసులొచ్చి కొట్టేవాళ్లు. రాత్రుళ్లు వర్షంలో నిద్రలేకుండా ఏడుస్తూ కూర్చునేవాణ్ణి. ఉమ, ముత్తురామన్లు తల్లిదండ్రుల్లా ఆదుకోకపోయుంటే నా జీవితం ఇప్పటికీ వీధుల్లోనే ఉండేదేమోఅంటాడు చిన్నయ్య. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేస్తూసుయంట్రస్టు రుణం తీర్చుకోవాలనీ, తల్లిని బాగా చూసుకోవాలనీ, ఆపైన సివిల్సర్వీసులకు సన్నద్ధమవాలన్నది చిన్నయ్య లక్ష్యం. ఇంజినీర్అయిన బిచ్చగాడు, కలెక్టర్కాలేడంటారా..!


No comments:

Post a Comment

EARN ONLINE BY VIEWING ADDS ( WORK FROM HOME )

 YOU CAN EARN ONLINE BY VIEWING ADDS EVERY DAY Every day you will get 20 adds,you have to view those adds. For viewing those adds the compan...